
మరిన్ని వార్తలు, లేటెస్ట్ అప్ డేట్స్ కోసం justpostnews.com ఫాలో కాగలరు.
Published 04 Jan 2024
రికార్డు స్థాయిలో నమోదైన తక్కువ స్కోర్లు… 121 ఏళ్ల తర్వాత ఒకే రోజు పడ్డ 23 వికెట్లు… రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఎదురీదిన దక్షిణాఫ్రికా.. బుమ్రా 5 వికెట్ల మ్యాజిక్… ఇలా భారత్-దక్షిణాఫ్రికా మధ్య సాగుతున్న రెండో టెస్టులో వింతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య కొనసాగుతున్న పోరాటం రంజుగా మారింది. 3 వికెట్లకు 62 పరుగులతో రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ టీమ్.. కెప్టెన్ మార్ క్రమ్ సెంచరీ(106; 103 బంతుల్లో 17×4, 2×6)తో పరువు నిలబెట్టుకుంది. అవతలి ఎండ్ లో ఏ ఒక్కరూ నిలబడకున్నా మార్ క్రమ్ పట్టుదలగా ఆడాడు. అయినా సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆ జట్టు 79 పరుగుల టార్గెట్ ను భారత్ ముందు ఉంచింది.
రెచ్చిపోయిన బుమ్రా..
భారత ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బాల్స్ తో చెలరేగాడు. నిన్న ఒక వికెట్ తీసుకున్న అతడు ఈ రోజు వరుసగా నలుగుర్ని ఔట్ చేశాడు. బుమ్రా దెబ్బకు బెడింగ్ హామ్(11), వెరీన్(9), యాన్సెన్(11), కేశవ్ మహరాజ్(3) బ్యాట్ కు పని చెప్పకుండానే వికెట్లు సమర్పించుకున్నారు. రబాడ(2)ను ప్రసిద్ధ్ అవుట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్లతోపాటు ఈ మ్యాచ్ లో బుమ్రా మొత్తం 8 వికెట్లు తీసుకున్నాడు. ఎక్స్ ట్రాలు 6 పోను మార్ క్రమ్ చేసిన 106 రన్స్ ను మినహాయిస్తే మిగతా బ్యాటర్లంతా చేసిన పరుగులు కేవలం 64 మాత్రమే. ముకేశ్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.