ఈ టీ20 వరల్డ్ కప్ లో అజేయంగా దూసుకుపోతున్న వెస్టిండీస్ టీమ్.. మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుని అగ్రస్థానాన్ని(Top Place) కొనసాగించింది. గ్రూప్ స్జేజ్ లో కంటిన్యూగా నాలుగింటికి నాలుగు విజయాలు సాధించింది. అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో నికోలస్ పూరన్ దంచికొట్టడంతో తొలుత 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన అఫ్గాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటవడంతో 104 రన్స్ తేడాతో విండీస్ గెలుపొందింది.
8 బాల్స్, 36 రన్స్…
అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో పూరన్… 6, 5nb, 5w, 0, 4lb, 4, 6, 6 ఇలా పూనకం వచ్చినట్లుగా బాదాడు. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే 36 రన్స్ వచ్చాయి. నోబాల్, వైడ్, లెగ్ బైస్ ఇలా ఎక్స్ ట్రాల రూపంలోనే భారీగా పరుగులు రాగా.. ఓవర్ పూర్తి చేయడానికి ఒమర్జాయ్ 8 బంతులు వేయాల్సి వచ్చింది.