ఏడుగురు డకౌట్… హయ్యెస్ట్ స్కోరు 11 అయితే రెండోస్థానం ఎక్స్ ట్రాలది(6). జట్టు మొత్తం చేసిన స్కోరు 27. 87 బాల్స్(14.3 ఓవర్లు) ఆడి ఈ చెత్త రికార్డు మూటగట్టుకుంది వెస్టిండీస్. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడో టెస్టులో అత్యంత దారుణంగా ఆడింది. తొలి ఇన్నింగ్స్ లో కంగారూలు 225, కరీబియన్లు 143 చేశారు. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 121కు ఆలౌటై 203 పరుగుల టార్గెట్ ఇచ్చింది. కానీ ఆతిథ్య(West Indies) జట్టు నిలవలేక మ్యాచ్ అప్పగించింది. స్టార్క్ 6 వికెట్లు తీస్తే.. బోలాండ్ హాట్రిక్ సాధించాడు. మూడింటికి మూడు టెస్టుల్ని గెలిచింది ఆస్ట్రేలియా. 1955లో ఇంగ్లండ్ తో టెస్టులో న్యూజిలాండ్ 26కే ఆలౌటైంది. కొద్దిలో ఆ రికార్డ్ మిస్సయ్యేదే. మరిన్ని వార్తలకు క్లిక్ చేయండి…: https://justpostnews.com