IPLలో అదరగొట్టి నిన్నటి తొలి మ్యాచ్ లో విఫలమైన అభిషేక్ శర్మ.. రెండో టీ20లో మాత్రం ఊచకోతకు దిగాడు. జింబాబ్వేతో హరారేలో జరిగిన మ్యాచ్ లో ఎడాపెడా సిక్సర్లు బాదుతూ దడదడలాడించాడు. కేవలం 46 బంతుల్లోనే 100 పూర్తి చేసుకున్నాడు. 82 వద్ద ఉన్న సమయంలోనే వరుసగా మూడు సిక్సర్లతో సెంచరీ చేరుకున్నాడు.
కానీ…
ఆ తర్వాతి బంతికే అభిషేక్(100; 47 బంతుల్లో 7×4, 8×6) క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ గిల్(2) తొందరగా ఔటైనా రుతురాజ్ తో కలిసి 100 రన్స్ జోడించాడు. అనంతరం రుతురాజ్(77 నాటౌట్; 47 బంతుల్లో 11×4, 1×6), చివర్లో రింకూసింగ్(48 నాటౌట్; 22 బంతుల్లో 2×4, 5×6) చితకబాదడంతో భారత్ 234/2తో భారీ స్కోరు చేసింది.