ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో ఊచకోత కోశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా వన్ మ్యాన్ షో చూపించాడు. ఇప్పటికే 3-1తో సిరీస్ చేజిక్కించుకున్న భారత్.. చివరి మ్యాచులో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. మరోసారి శాంసన్(16), సూర్య(2) విఫలమైతే తిలక్ వర్మ(24), దూబె(30) కొద్దిసేపు నిలబడ్డారు. ఒక ఎండ్ లో వికెట్లు కోల్పోతున్నా మరో ఎండ్ లో అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. అతడు 17 బంతుల్లో హాఫ్ సెంచరీ, 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్, తిలక్ జోడీ రెండో వికెట్ కు 36 బంతుల్లో 100 భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ లెఫ్ట్ హ్యాండర్ దెబ్బకు జేమీ ఓవర్టన్ 2 ఓవర్లలో 41 పరుగులు, ఆర్చర్ 3 ఓవర్లలో 47 రన్స్ ఇచ్చారు.
ICC టెస్టు హోదా ఉన్న దేశాలపై రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా అభిషేక్ నిలిచాడు. సెంచరీ తర్వాత కూడా 3 సిక్సర్లు బాదిన అతడు చివరకు 135 పరుగుల వద్ద ఔటయ్యాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులు చేసి వెనుదిరగడంతో చివర్లో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ పాటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టీమ్ఇండియా 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోరు సాధించి ఇంగ్లండ్ పెద్ద సవాల్ విసిరింది.