
Published 01 Oct 2023
ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలమని స్కూల్ విద్యార్థులు మరోసారి నిరూపించారు. చిన్న వయసులోనే అపార ప్రతిభ చూపి ఉమ్మడి జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయి ప్రశంసలు అందుకున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) క్రికెట్ అండర్-14 విభాగంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి ఎంఎస్ క్రికెట్ అకాడెమీ(MS Cricket Academy) విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. మొత్తం ఆరుగురు విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికైనట్లు అకాడెమీ తెలిపింది. సిద్ధార్థ్ రెడ్డి, చెట్టి యువ, అవినాశ్ సింగ్, రాజేశ్, యువరాజ్, ఆయాన్ ఉమ్మడి జిల్లా(Erstwhile District) జట్టుకు సెలెక్ట్ అయ్యారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెట్ టీమ్ ల ఎంపికలు జరిగాయి.
తమ క్రికెట్ అకాడెమీ స్టూడెంట్స్ అద్భుత ప్రతిభ కనబరచడం పట్ల నిర్వాహకులు శ్రీనాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కోచ్ లు చంద్రమౌళి, ఇనాముల్ రహమాన్, మహ్మద్ ఖలీం ఆనందం వ్యక్తం చేశారు. ఈ పిల్లలంతా భవిష్యత్తులో మరింత ఉన్నతంగా రాణించాలంటూ వారందరినీ అభినందించారు.