ఇంగ్లండ్ పై అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ విరుచుకుపడ్డాడు. వికెట్లు తీయలేక ఇంగ్లిష్ బౌలర్లు అల్లాడిపోయారు. హష్మతుల్లా(40), అజ్మతుల్లా(41; 31 బంతుల్లో), నబీ(40; 20 బంతుల్లో) ధాటితో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. ఆర్చర్ దెబ్బకు 37కే 3 వికెట్లు పడ్డ జట్టును ఇబ్రహీం(177; 146 బంతుల్లో 12×4, 6×6) దగ్గరుండి నడిపించాడు. నాలుగో వికెట్ కు 103, ఐదో వికెట్ కు 72, ఆరో వికెట్ కు 111 రన్స్ పార్ట్నర్ షిప్స్ దొరికాయి. 47.1 ఓవర్లలో 300 స్కోరు దాటగా.. చివరకు 7 వికెట్లకు 325 పరుగుల భారీ స్కోరు నమోదైంది. ఆర్చర్, వుడ్, ఆదిల్.. వికెట్ల కోసం అపసోపాలు పడ్డారు. ఈ భారీ టార్గెట్ ఛేదిస్తేనే పోటీలో ఇంగ్లండ్ నిలిచేది.
చరిత్ర సృష్టించి…
ICC ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు ఇబ్రహీం జద్రాన్(177). ఇంగ్లండ్ కు చెందిన బెన్ డకెన్(165) ఈ టోర్నీలోనే నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టాడు.