రెండు జట్లకూ కీలకం(Crucial)గా మారిన మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ మరోసారి సత్తా చాటింది. ఆస్ట్రేలియా బౌలింగ్ దళాన్ని(Team) సమర్థంగా ఎదుర్కొంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్.. ఓపెనర్ గుర్బాజ్(0), ఇంగ్లండ్ పై సెంచరీ వీరుడు జద్రాన్(22), రహ్మత్ షా(12) వికెట్లు త్వరగా కోల్పోయింది. కానీ సెదిఖుల్లా(85), ఒమర్జాయ్(67).. ప్రత్యర్థితో పోరాటం చేశారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఈ ఇద్దరూ ఆసీస్ బౌలింగ్ పై దాడికి దిగారు. సరిగ్గా 50 ఓవర్లకు ఆ జట్టు 273 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా సెమీస్ చేరుతుంది.