అఫ్గానిస్థాన్ చరిత్ర(History) సృష్టించింది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఘనంగా ప్రవేశించింది. భారత్ చేతిలో ఓటమితో బంగ్లా-అఫ్గాన్ ఫలితంపైనే ఆధారపడ్డ ఆస్ట్రేలియా.. బంగ్లా ఓటమి చెందగానే స్వదేశానికి బాట పట్టబోతున్నది. సెమీస్ బెర్త్ పోరాటంలో తొలుత అఫ్గాన్ 5 వికెట్లకు 115 పరుగులు చేసింది. 12.1 ఓవర్లలో 116 టార్గెట్ సాధిస్తేనే బంగ్లాకు అవకాశం ఉండేది. కానీ డక్ వర్త్ లూయిస్ పద్ధతి(DLS)లో 8 రన్స్ తేడాతో గెలుపు అఫ్గాన్ సొంతమైంది.
కానీ…
వర్షం రెండుసార్లు అంతరాయం(Disturb) కలిగించడంతో మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం టార్గెట్ ను 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్దేశించగా.. ఓపెనర్ లిట్టన్ దాస్ మినహా అంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. 80 స్కోరుకే 7 వికెట్లు చేజార్చుకుంది ఆ టీమ్. అసలైన పోరులో స్పిన్నర్ రషీద్ ఖాన్, పేసర్ నవీన్ విజృంభించి చెరో 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. లిట్టన్ తర్వాత తౌహిద్(14)దే సెకండ్ హయ్యెస్ట్ స్కోర్.
మునివేళ్లపై…
బంగ్లా ఆడుతున్నంతసేపూ ఆస్ట్రేలియన్లు మినహా అందర్నీ మునివేళ్లపై నిలబెట్టేలా టెన్షన్ కనిపించింది. లిట్టన్(52 నాటౌట్) ఒంటరి పోరాటం వృథా అయినా గట్టిగా నిలబడి శభాష్ అనిపించుకున్నాడు. 18వ ఓవర్లో నవీన్ ఉల్ హక్ అద్భుతం(Wonder) చేశాడు. నాలుగో బంతికి టస్కిన్ ను బౌల్డ్ చేసిన అతడు.. తర్వాతి బాల్ కే ముస్తాఫిజుర్ ను వికెట్ల ముందు(LBW) దొరకబుచ్చుకున్నాడు. అంపైర్ డిసిషన్ పై బంగ్లా రివ్యూ కోరితే అది ప్రతికూలం(Nagative)గా రావడంతో అఫ్గాన్ ఆటగాళ్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.