అద్భుత విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించి సెమీస్(Semi Finals)లో అడుగుపెట్టిన అఫ్గానిస్థాన్ అసలైన మ్యాచ్ లో చేతులెత్తేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 23 స్కోరుకే 5 వికెట్లు చేజార్చుకున్న టీమ్ 50/9కి చేరుకుంది. దక్షిణాఫ్రికా(South Africa) పేసర్లు వేసిన బంతులకు బ్యాట్ కూడా అడ్డం పెట్టే పరిస్థితి లేకుండా పోయి చివరకు 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌట్ అయింది.
50 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రషీద్ సేన.. అదే స్కోరుపై మొత్తం 3 వికెట్లు నష్టపోయి 50/9తో నిలిచింది. మార్కో యాన్సెన్ 3, షంసి 3, కగిసో రబాడ 2, ఎన్రిచ్ నోకియా 2 వికెట్లు తీసుకున్నారు. గుర్బాజ్(0), జద్రాన్(2), గుల్బదీన్(9), ఒమర్జాయ్(10), నబీ(0), ఖరోటే(2), కరీం(8), నూర్(0) ఔటైయ్యారు.