అఫ్గానిస్థాన్(Afghanistan) చరిత్ర సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్(England)ను ఓడించి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్.. ఇబ్రహీం జద్రాన్(177) సెంచరీతో 325/7 స్కోరు చేసింది. తర్వాత ఇంగ్లండ్.. 133కే సాల్ట్(12), డకెట్(38), స్మిత్(9), బ్రూక్(25) వికెట్లు కోల్పోయింది. తర్వాత కెప్టెన్ బట్లర్(38), లివింగ్ స్టోన్(10) ఔటవడంతో జో రూట్(120), ఓవర్టన్(32) ఆపద్బాంధవులయ్యారు. కానీ ఒత్తిడిలో ఆ ఇద్దరూ వెనుదిరగడంతో ఇంగ్లిష్ జట్టుకు పరాజయం తప్పలేదు. మరో బంతి మిగిలుండగానే 317కు ఆలౌటైంది. 8 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లు తీసుకున్నాడు.