
ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్-పాక్ మ్యాచ్ రద్దవడంతో అభిమానుల్లో ఒకటే నిరాశ. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో ఈ నెల 2న నిర్వహించిన ఈ మ్యాచ్ అర్థంతరంగా రద్దు కావడంతో.. ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కానీ వారి ఆశల్ని సజీవంగా ఉంచుతూ ఈ రెండు జట్లూ మరోసారి తలపడబోతున్నాయి. ఆసియా కప్ గ్రూప్-A నుంచి భారత్-పాక్ సూపర్-4కు చేరడంతో ఇప్పుడు రెండోసారి దాయాది దేశంతో పోరుకు టీమ్ఇండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్ రద్దయి 1 పాయింట్ సాధించిన ఇండియా.. నేపాల్ పై భారీ విజయంతో మరో రెండు పాయింట్లు పొందింది.
ఈ మ్యాచ్ ఈ నెల 10న ఆదివారం నాడు జరగనుండటంతో ఫ్యాన్స్ తో కిక్కిరిసి పోతుందనడంలో సందేహం లేదు. భారత్-పాక్ మ్యాచ్ పల్లెకెలె స్టేడియానికి బదులు కొలంబోలో నిర్వహిస్తారు. పల్లెకెలెలో కంటిన్యూ వర్షాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.