భారత జట్టు మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ ను… సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా BCCI నియమించింది. ఈ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పోస్టుకు పలువురు మాజీ ఆటగాళ్లు అప్లై చేసుకున్నారు. అయితే ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ అడ్వయిజరీ కమిటీ(CAC).. అజిత్ అగార్కర్ ను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. దీంతో ఈ మాజీ ఆల్ రౌండర్ ను నియమిస్తూ BCCI నిర్ణయం తీసుకుంది. సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శివసుందర్ దాస్, శ్రీధరన్ శరత్… సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉంటారని BCCI ప్రకటించింది.
26 టెస్టుల్లో 2,745 రన్స్ చేసిన అగార్కర్… 58 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 191 మ్యాచ్ లు ఆడి 8,021 పరుగులు, 288 వికెట్లు తీసుకుని బెస్ట్ ఆల్ రౌండర్ గా టీమ్ ఇండియాకు సేవలందించాడు.