వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఈసారి ఇద్దరు కొత్త ఛాంపియన్లు అవతరించారు. మహిళల సింగిల్స్ లో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మార్కెటా వొండ్రుసోవా విన్నర్ గా నిలిచి తొలి గ్రాండ్ స్లామ్ సాధించగా.. ఇప్పుడు స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాస్ సైతం నూతన ఛాంపియన్ గా పుట్టుకొచ్చాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్స్ లో ఎంతో అనుభవజ్ఞుడైన నొవాక్ జకోవిచ్(సెర్బియా)ను ఓడించి కప్ ను ముద్దాడాడు. వింబుల్డన్ సెంటర్ కోర్టులో హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో అల్కరాస్.. 1-6, 7-6(8/6), 6-1, 3-6, 6-4 తేడాతో జకోవిచ్ పై తిరుగులేని విజయం సాధించాడు. ఫైనల్ చేరిన మొదటి సారే వింబుల్డన్ గెలిచిన ఘనతను సొంతం చేసుకున్నాడు 20 ఏళ్ల అల్కరాస్.
సీనియర్ ప్లేయర్ జకోవిచ్ కు 1-6తో తొలి సెట్ కోల్పోయినా రెండో సెట్ లో అల్కరాస్ వేగంగా పుంజుకున్నాడు. ఆ సెట్ ను 7-6(8/6) తేడాతో కైవసం చేసుకున్నాడు. మూడో సెట్ ను ఈ స్పెయిన్ ప్లేయర్ ఈజీగా గెలవడంతో నాలుగో సెట్ పైనే అందరి దృష్టి పడింది. ఈ సెట్ ను 6-3తో జకోవిచ్ సొంతం చేసుకోవడంతో ఐదో సెట్ ఆడాల్సి వచ్చింది. ఈ చివరి సెట్ నువ్వా నేనా అన్నట్లు సాగినా చివరకు పట్టుదల ప్రదర్శించిన అల్కరాస్ నే విజయం వరించింది.
Congratulations Alcaraj