IPLకు రాకముందు కేవలం ఒక్క దేశవాళీ టీ20 ఆడాడు. అది కూడా డకౌట్. అలాంటి అనికేత్ వర్మకు రూ.30 లక్షలు పెట్టింది సన్ రైజర్స్(SRH). ఇప్పుడతడే వరంగా మారాడు. ఢిల్లీతో మ్యాచ్ లో 37కే 4 వికెట్లు పడ్డా.. అనికేత్(74; 41 బంతుల్లో 5×4, 6×6) ముందుండి నిలిచాడు. అభిషేక్(1), హెడ్(22), ఇషాన్(2), నితీశ్(0) క్లాసెన్(32) వెనుదిరిగినా ఆగలేదు. అతడు 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 50 చేశాడు. స్టార్క్ 5, కుల్దీప్ 3 వికెట్లతో దెబ్బకొట్టినా ఈ మధ్యప్రదేశ్ కుర్రాడు బెదరలేదు. అప్పటికే 6 సిక్సులు బాదిన అతడు మరో భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. దీంతో 18.4 ఓవర్లలోనే 163కే చాపచుట్టేసింది.