ఆరుగురు ఆడింది ఒకెత్తు…
ఆ ఇద్దరు ఆడింది మరొకెత్తు…
అశ్విన్(102 నాటౌట్) అద్భుత సెంచరీ…
శతకం దిశగా జడేజా(86 నాటౌట్)…
రోహిత్(6), గిల్(0), కోహ్లి(6), పంత్(39), జైస్వాల్(56), రాహుల్(16)… ఇలా 144కే 6 వికెట్లు కోల్పోయిన జట్టుకు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మాయాజాలం లాంటి ఇన్నింగ్స్ తో ఊపిరిపోశారు. కనీసం స్కోరు 200 అయినా దాటగలుగుతుందా అనే స్థాయి నుంచి అవలీల(Easy)గా 300 దాటేసింది. ఈ జోడీ(Partners) పోటాపోటీగా వన్డే తరహాలో ఆడటంతో చెన్నై టెస్టులో భారత్ పట్టు సాధించింది.
ఏడో వికెట్ కు ఈ జంట 114 బాల్స్ లోనే సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసింది. అశ్విన్ 58 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. ఇద్దరూ ఫోర్లు, సిక్సర్లతో హడలెత్తించారు. భారత్ మీద పైచేయి సాధించామనుకున్న బంగ్లా బౌలర్లు ఈ అసలు సిసలు ఆల్ రౌండ్లర మాయతో నిశ్చేష్టులయ్యారు. ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 339/6తో ఉంది.