ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు గాను తొలి రెండు వన్డేలకు కె.ఎల్.రాహుల్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి రెస్ట్ ఇవ్వడంతో కెప్టెన్సీ బాధ్యతల్ని రాహుల్ చూస్తాడు. రాహుల్ కు వైస్ గా రవీంద్ర జడేజా నియమితుడయ్యాడు. హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ కు కూడా విశ్రాంతినిచ్చారు. అనూహ్యంగా తొలి రెండు వన్డేలకు ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ కు మూడో వన్డేకు సైతం టీమ్ లో స్థానం కల్పించారు. ఈ నెల 22, 24, 27 తేదీల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లు జరుగుతాయి.
మూడో వన్డేకు రోహిత్, కోహ్లి, హార్దిక్, కుల్దీప్ జట్టులో చేరుతారు. రోహిత్ కెప్టెన్ గా, హార్దిక్ వైస్ కెప్టెన్ గా భారతజట్టు మూడో వన్డే ఆడుతుంది. అక్టోబరు 5 నుంచి జరిగే వరల్డ్ కప్ కు ట్రయల్ గా ఈ టోర్నీని చూస్తున్నారు.
తొలి రెండు వన్డేలకు జట్టు
కేఎల్ రాహుల్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.
మూడో వన్డేకు జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), హార్దిక్ పాండ్య(వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్(ఫిట్ నెస్ బట్టి), రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.