భారత హాకీ(Hockey) జట్టు ఆసియా ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో దక్షిణ కొరియాపై జయభేరి మోగించింది. ఆట మొదలైన తొలి నిమిషంలోనే మొదటి గోల్ వచ్చింది. హర్మన్ ప్రీత్ సింగ్ అందించిన బాల్ ను గోల్ గా సుఖ్ జీత్ మలిచాడు. తొలి క్వార్టర్లో ఇంకో గోల్ మిస్సయినా, రెండో క్వార్టర్లో దిల్ ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. మొత్తంగా 4-1తో కొరియాను చిత్తుచేసి నాలుగోసారి ఛాంపియన్ గా అవతరించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా కప్పును మరోసారి గెలిచిన భారత సేన.. 2026 ప్రపంచకప్ కు అర్హత సాధించింది.
కప్పు గెలిచిన టోర్నీలివే…
2003
2007
2017
2025.