తొలి ఇన్నింగ్స్ లో 7, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో గస్ అట్కిన్సన్(Gus Atkinson) చెలరేగడంతో వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం(Big Win) సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్ లో కరీబియన్లు రెండు సార్లు తక్కువ స్కోర్లకే కుప్పకూలారు.
తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 121 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 371 రన్స్ చేసింది. 250 పరుగులు వెనుకబడి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విండీస్.. 136 రన్స్ కే ఆలౌటైంది. గుడకేశ్(31 నాటౌట్), అథనేజ్(22), హోల్డర్(20)దే హయ్యెస్ట్ స్కోర్లు.
దీంతో లార్డ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్.. ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 12 వికెట్లు తీసిన అట్కిన్సన్ కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కగా, మూడు టెస్టుల సిరీస్ లో ఆ టీమ్ 1-0తో నిలిచింది.