యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ రసవసత్తరంగా సాగుతోంది. తొలి టెస్టును ప్రత్యర్థికి అప్పగించిన ఇంగ్లాండ్… ఈ టెస్టులోనూ ఆసీస్ కు లీడ్ కటబెట్టింది. మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేయంతో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 278 రన్స్ తో పటిష్ఠ స్థితిలో నిలిచిన ఇంగ్లాండ్… మూడో రోజు మరో 47 పరుగులకే మిగతా 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆసీస్ 91 రన్స్ లీడ్ సాధించింది.
278 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో గ్రౌండ్ లోకి దిగిన ఇంగ్లీష్ జట్టు.. టపటపా వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ బెన్ స్టోక్స్(17) పరుగులేమీ చేయకుండానే వెనుదిరగ్గా.. యువ సంచలనం హ్యారీ బ్రూక్(50; 68 బంతుల్లో 4X4) ఇంకో 5 రన్స్ జోడించి పెవిలియన్ చేరాడు. జానీ బెయిర్ స్టో(16), స్టూవర్ట్ బ్రాడ్(12) పెద్దగా స్కోరు చేయకపోవడంతో ఆ టీమ్ 325 రన్స్ కే ఫుల్ స్టాప్ పెట్టింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/88 ), ట్రావిస్ హెడ్(2/17), జోష్ హేజిల్ వుడ్(2/71 ) సత్తా చూపారు. కంగారూ జట్టు రెండో ఇన్సింగ్స్ స్టార్ట్ చేసింది.