ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-Bలో ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరింది. వర్షం వల్ల అఫ్గానిస్థాన్ తో మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చాయి. ఈ ఒకటితో కలిపి ఆస్ట్రేలియా 4 పాయింట్లతో సెమీస్ చేరింది. రేపటి దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మ్యాచ్ విజేత.. సెమీస్ చేరే రెండో జట్టవుతుంది. తొలుత అఫ్గాన్ 273 పరుగులకు ఆలౌటైంది. అనంతరం కంగారూ టీమ్.. 12.5 ఓవర్లలో 109/1తో పటిష్ఠంగా ఉన్న స్థితిలో వర్షం పడింది. మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసి ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మూడు మ్యాచులకు గాను ఆస్ట్రేలియా.. ఒక దాంట్లో గెలవగా, మరో రెండు వన్డేలు వర్షార్పణమయ్యాయి.