టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు. ఇప్పటికే తమ బోర్డు అయిన క్రికెట్ ఆస్ట్రేలియా(CA) తీరును ఉస్మాన్ ఖవాజా తప్పుబట్టాడు. ఇప్పుడు మరో మాజీ బ్రాడ్ హాగ్ టీమ్ తీరును తీవ్రంగా విమర్శించాడు. భారత్ తో మ్యాచ్ అంటే ఇలాగేనా ఆడేది అంటూనే కెప్టెన్ రోహిత్ శర్మది బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ అంటూ ప్రశంసలు కురిపించాడు.
హాగ్ మాటల్లోనే…
‘నాకు తెలిసి ఆసీస్ ఆటగాళ్లు ఏమాత్రం ప్రిపేర్ కాలేదు.. మిచెల్ స్టార్క్ తోనే ఇబ్బంది.. బాల్ స్వింగ్ కాని పరిస్థితుల్లో వెంటనే లెంగ్త్(Length)ను మార్చుకోలేదు.. అలా చేయకపోవడం వల్ల ఒక ఓవర్లోనే రోహిత్ 29 రన్స్ పిండుకున్నాడు.. అని ఆసీస్ తరఫున 7 టెస్టులు, 123 వన్డేలు, 15 టీ20లు ఆడిన హాగ్ గుర్తు చేశాడు.
ఒక్కటి చాలు…
‘రోహిత్ కు ఒక్క ఛాన్స్ చాలు.. గాలి దిశ వల్ల స్వింగ్ కానప్పుడు బౌలింగ్ తీరు మారాలి.. దానివల్లే ఆస్ట్రేలియాకు కష్టాలు ఎదురయ్యాయి.. రోహిత్ ఎక్స్ ప్లోజివ్ బ్యాటింగ్ ముందు మార్ష్ సేన ఫీల్డింగ్ తేలిపోయింది.. పాండ్య క్యాచ్ ను కెప్టెన్ వదిలేయడం తీవ్రంగా ప్రభావం చూపింది..’ అని హాగ్ అన్నాడు.