
ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆతిథ్య జట్టు పట్టుబిగించింది. ఆ జట్టు బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 299 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్(51; 60 బంతుల్లో 7×4, 1×6), లబుషేన్(51; 115 బంతుల్లో 6×4) రాణించారు. ట్రావిస్ హెడ్(48), స్మిత్(41), వార్నర్(32), క్యారీ(20) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. మిచెల్ స్టార్క్(23), కమిన్స్(1) క్రీజులో ఉన్నారు. క్రిస్ వోక్స్ (4/52) వికెట్లు తీయగా, బ్రాడ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మార్క్ వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ తీసుకున్నారు.
టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లాండ్.. ఆసీస్ ను ఆదిలోనే కష్టాల్లో పడేసింది. ఇన్నింగ్స్ 15 పరుగుల వద్ద తొలి వికెట్ ఖవాజా(3)ను ఆస్ట్రేలియా కోల్పోయింది. కొద్దిసేపు నిలిచినట్లు కనిపించిన వార్నర్ సైతం 61 రన్స్ వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా అందరూ పెవిలియన్ చేరడంతో ఆసీస్ కథ చివరకు చేరింది. ఏ ఒక్క జోడీ కూడా సరైన పార్ట్నర్ షిప్ నమోదు చేయకపోవడంతో కంగారూలు పెద్దగా స్కోరు చేయలేకపోయారు.