ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-Bలో కీలక మ్యాచ్ రద్దయింది. రావల్పిండిలో ఎడతెరిపి లేకుండా(Continue Rain) కురుస్తున్న వర్షంతో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు చేసి చెరో పాయింట్ ఇచ్చారు. ఇరు జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ గెలవగా, ఇప్పుడీ వన్డే రద్దుతో ఇంగ్లండ్ కు దారులు తెరచుకున్నాయి. ఆసీస్ చేతిలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా చేతిలో అఫ్గాన్ ఓడిపోయాయి. ఇంగ్లండ్ కు ఇంకా 2 మ్యాచులుండగా వాటిల్లో గెలిస్తేనే 4 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. అఫ్గాన్ కు ఇదే రకమైన అవకాశమున్నా కంగారూ, ప్రొటీస్ జట్లను ఓడించడం కష్టమే. ఇలా అఫ్గాన్, ఇంగ్లండ్ ఒక్కటి ఓడినా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా నేరుగా సెమీఫైనల్లో అడుగుపెడతాయి. గ్రూప్-Aలో ఈపాటికే భారత్, న్యూజిలాండ్ సెమీస్ లో ప్రవేశించాయి.