భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్(Head Coach)గా నియమితుడైన గంభీర్ పై ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించాడు. గౌతమ్ చేతుల్లో భారత్ భద్రంగా ఉంటుందని కొనియాడాడు. పొట్టి ప్రపంచకప్ లో టీమ్ఇండియా ప్రస్థానం, గంభీర్ కోచ్ పదవి, సూర్య క్యాచ్ గురించి మాట్లాడాడు.
గ్రేట్ పర్సన్…
ఆటకే అంకితమైన గొప్ప వ్యక్తి గౌతమ్ గంభీర్ అని.. 76 టెస్టులు, 221 వన్డేలు, 25 టీ20లు ఆడిన బ్రెట్ లీ అన్నాడు. ‘అతడు ప్రతిసారీ అద్భుతంగా పనిచేస్తాడు.. ఆటలో ఎప్పుడూ టాప్ లో ఉంటాడు.. టీంలో ఐక్యత(Unite) కోసం కృషి చేస్తూనే గొప్ప జట్టు తయారయ్యేలా సర్వశక్తులూ ధారపోస్తాడు.. అతడో అద్భుతం.. అతడి దూకుడు, గెలవాలన్న కసి టీమ్ఇండియాకు గొప్ప వరం..’ అని ప్రశంసించాడు.
టీమ్ఇండియా వరల్డ్ కప్ లో పర్ఫెక్ట్ స్టైల్లో ఆడిందని, కానీ ఆస్ట్రేలియా ఆ విషయంలో తడబడిందని గుర్తు చేసిన బ్రెట్ లీ… కప్పుతో ఘనమైన వీడ్కోలు తీసుకున్న రాహుల్ ద్రవిడ్ ను అభినందించాడు. క్యాచ్ లు మ్యాచ్ ల్ని గెలిపిస్తాయన్న మాటను అద్భుత క్యాచ్ తో సూర్య మరోసారి నిరూపించాడన్నాడు.