సొంతగడ్డపై ఓటమిని తప్పించుకునేందుకు ఆస్ట్రేలియాకు నానా కష్టాలు(Troubles) పడాల్సి వచ్చింది. పెర్త్ టెస్టులో టీమ్ఇండియా తిరుగులేని రీతిలో పట్టు సాధించడంతో ఆ జట్టు పరాజయం దిశగా సాగుతున్నది. 534 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్.. 17 స్కోరుకే 4 వికెట్లు కోల్పోయింది. 12/3తో నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన కంగారూలు.. మరో 5 పరుగులకే ఉస్మాన్ ఖవాజా(4) వికెట్ కోల్పోయారు. నిన్న మెక్ సీనే(0) డకౌటయితే నైట్ వాచ్ మన్ కమిన్స్(2), లబుషేన్(3) వెంటవెంటనే ఔటవడంతో బుమ్రా సేన పట్టు బిగించింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులు చేయగా, ఆసీస్ 104కే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ను టీమ్ఇండియా 487/6కు డిక్లేర్డ్ చేయగా ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ కలిపి ఆస్ట్రేలియా ఎదుట 534 పరుగుల లక్ష్యాన్ని(Target) ఉంచింది.