వెస్టిండీస్(West Indies) బౌలర్ల దెబ్బకు తొలి టెస్టులో ఆస్ట్రేలియా విలవిల్లాడింది. ట్రావిస్ హెడ్(59) టాప్ స్కోరర్. జేడెన్ సీల్స్ 5, షమర్ జోసెఫ్ 4 వికెట్లు తీసుకోవడంతో కంగారూ జట్టు 180కే ఆలౌటైంది. ఖవాజా(47), కోన్స్టాస్(3), గ్రీన్(3), ఇంగ్లిస్(5), వెబ్ స్టర్(11), క్యారీ(8), కమిన్స్(28) చొప్పున చేశారు. ఆసీస్ ను ఔట్ చేశామన్న ఆనందమే తప్ప సొంతగడ్డపై విండీస్ సైతం అలాగే ఆడింది. బ్రేత్ వైట్(4), క్యాంప్ బెల్(7), కార్టీ(20), బ్రెండన్(26), వారికన్(0) ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఆ జట్టు 72కే 5 వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతానికి 132/5తో ఉంది.