బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ పరాజయం పరిపూర్ణమైంది(Completed). సిడ్నీలో జరిగిన ఐదోదైన చివరి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించింది. కేవలం నాలుగు వికెట్లే కోల్పోయి టార్గెట్ ను రీచ్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 181 ఆలౌటైంది. 4 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమ్ఇండియా 181కే చాపచుట్టేసింది. దీంతో కంగారూల ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచడంతో ఆ జట్టు ఆటగాళ్లు పెద్దగా ఇబ్బంది పడకుండానే ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని కరిగించేశారు. ట్రావిస్ హెడ్(34 నాటౌట్), బ్యూ వెబ్ స్టర్(39 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు.
తొలి టెస్టులో భారత్ గెలిస్తే రెండో టెస్టు ఆస్ట్రేలియా వశమైంది. మూడో టెస్టు డ్రా కాగా, నాలుగు, ఐదు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్ ను దక్కించుకుంది కంగారూ జట్టు. ఈ టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిపోగా.. సిరీస్ ను 3-1 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. ఈ పరాజయంతో టీమ్ఇండియా WTC ఫైనల్ ఆశలు గల్లంతు కాగా.. ఆస్ట్రేలియా తుది పోరుకు అర్హత సాధించింది. కంటిన్యూగా రెండో సారి ఆ టీమ్ WTC ఫైనల్ చేరగా.. జూన్ లో జరిగే ఆఖరి పోరులో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.