ఇంగ్లండ్ విసిరిన భారీ లక్ష్యాన్ని సులువుగా ఛేదించాడు ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ ఇంగ్లిస్. 352 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్.. జోష్ దూకుడుతోనే గెలుపును దక్కించుకుంది. షార్ట్(63), హెడ్(6), స్మిత్(5), లబుషేన్(47), క్యారీ(69) చొప్పున స్కోర్లు చేశారు. ముఖ్యంగా ఇంగ్లిస్.. 77 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదడంతో భారీ టార్గెట్ సులువుగా కరిగిపోయింది. 27 స్కోరుకే 2 వికెట్లు పడిపోయిన టీమ్ ను అతడే ఒడ్డుకు చేర్చాడు. బౌలర్లు చివరిదాకా ఎంతగా ప్రయత్నించినా ఇంగ్లిస్(120 నాటౌట్; 86 బంతుల్లో 8×4, 6×6)ను మాత్రం ఔట్ చేయలేకపోయారు. 47.3 ఓవర్లలో 356/5 చేసి 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. అంతకుముందు బెన్ డకెట్(165) అండతో ఇంగ్లిష్ జట్టు 351/8 చేసింది.