6 బాల్స్ లో మరో 16 పరుగులు చేయాల్సిన టైమ్ లో చివరి బంతికి(Last Ball) ఫోర్ కొట్టి ఆస్ట్రేలియాను గెలిపించాడు టిమ్ డేవిడ్. సొంతగడ్డపై జరుగుతున్న టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ కు తొలి మ్యాచ్ లో పరాభవమే(Lost) ఎదురైంది. వెల్లింగ్టన్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లకు 215 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్… చివరి బంతికి విన్నింగ్(Winning) షాట్ తో మ్యాచ్ ను విజయంతో ముగించింది.
ఇరుజట్ల బ్యాటర్లదే…
న్యూజిలాండ్ టీమ్ లో ఫిన్ అలెన్(32), డెవాన్ కాన్వే(63), రచిన్ రవీంద్ర(68) బాగా ఆడారు. ముఖ్యంగా రచిన్ మాత్రం ఆరు సిక్సర్లతో 35 బంతుల్లోనే 68 కొట్టాడు. అటు కాన్వే సైతం అదే తీరుగా ఆడాడు. ఇక కంగారూ టీమ్ లో ట్రావిస్ హెడ్(24), డేవిడ్ వార్నర్(32), మిచెల్ మార్ష్(72 నాటౌట్), గ్లెన్ మ్యాక్స్ వెల్(25), టిమ్ డేవిడ్(31 నాటౌట్) గెలుపులో తలో చేయి వేశారు.
ఫైనల్ ఓవర్ అలా…
చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమైన స్థితిలో తొలి మూడు బంతులకు వైడ్ సహా సింగిల్స్ వచ్చాయి. నాలుగో బాల్ ను సిక్స్ గా, ఐదో బాల్ కు మళ్లీ సింగిల్ రాగా… ఆఖరి బంతిని ఫోర్ గా మలచడంతో ఆస్ట్రేలియా గెలుపు ఖాయమైంది. ఈ విజయంతో 3 మ్యాచ్ ల సిరీస్ లో కంగారూలు 1-0 ఆధిక్యంతో ఉన్నారు.