కష్టాల్లో ఉన్న లఖ్ నవూ సూపర్ జెయింట్స్.. ఆయుష్ బదోని అర్థ సెంచరీ(Half Century)తో ఆదుకోవడంతో కోలుకుంది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమ్ ను టెయిలెండర్లతో ముందుకు నడిపించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ తప్ప అంతా ఫెయిల్ అయిన వేళ బదోని బ్యాటింగ్.. LSGని కోలుకునేలా చేసింది. చివరి ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు పట్టుతప్పడంతో లఖ్ నవూ మంచి స్థితిలో నిలిచింది.
డికాక్(19), రాహుల్(39), పడిక్కల్(3), మార్కస్ స్టాయినిస్(8), నికోలస్ పూరన్(0), దీపక్ హుడా(10), కృణాల్ పాండ్య(3) స్కోరు చేశారు. కానీ బదోని(55 నాటౌట్; 35 బంతుల్లో 5×4, 1×6) మాత్రం చివరిదాకా పట్టు విడవకుండా తమ టీమ్ ను మంచి స్థాయిలో ఉంచే ప్రయత్నం చేశాడు. చివర్లో అర్షద్ ఖాన్(20)తో కలిసి దూకుడుగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో లఖ్ నవూ 7 వికెట్లకు 167 పరుగుల వద్ద ముగించింది.
కెప్టెన్ రాహుల్ మినహా టాప్, మిడిలార్డర్ మొత్తం విఫలమైనా బదోని ఒంటరి పోరాటం చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన అతడు తొమ్మిదో నంబరు బ్యాటర్ తో ఇన్నింగ్స్ ను నడిపించాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకోగా, పేస్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు రాబట్టాడు.