బెంగళూరు(RCB)తో మ్యాచ్ లో రాజస్థాన్(RR) చిత్తుగా ఓడింది. ఓపెనర్ జైస్వాల్(75), పరాగ్(30), జురెల్(35) రాణించడంతో తొలుత 173/4 చేసిన రాయల్స్.. స్వల్ప స్కోరును కాపాడుకోలేదు. చేతిలో వికెట్లున్నా పరుగులు చేయలేకపోయింది. ఫిల్ సాల్ట్(65; 33 బంతుల్లో), కోహ్లి(62 నాటౌట్; 45 బంతుల్లో) విజృంభించడంతో గెలుపు కోసం RCBకి పెద్దగా కష్టపడే అవసరం రాలేదు. సాల్ట్-కోహ్లి హాఫ్ సెంచరీలకు తోడు పడిక్కల్(40; 28 బంతుల్లో) మెరుపులతో 9 వికెట్ల తేడాతోఘోర పరాజయం పాలైంది రాజస్థాన్.