రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) దెబ్బకు చెన్నై సూపర్ కింగ్స్(CSK) విలవిల్లాడింది. RCB విసిరిన 197 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పడరాని పాట్లు పడింది. త్రిపాఠి(5), రుతురాజ్(0), హుడా(4), శామ్ కరణ్(8) ఔటవడంతో 52 స్కోరుకే 4 వికెట్లు చేజార్చుకుంది. దాదాపు 10 రన్ రేట్ సాధించాల్సిన CSK.. కేవలం 6కు పైగా రన్ రేట్ తోనే బండి నడిపింది. నిలదొక్కుకున్నాడని భావించిన రచిన్(41), దూబె(19) సైతం ఔటవడంతో 80 స్కోరుకే 6 వికెట్లు పడ్డాయి. 8 వికెట్లకు 146 పరుగులే చేసిన CSK.. 50 పరుగుల తేడాతో RCB చేతిలో ఓడింది. ఆడిన రెండింట్లో బెంగళూరు విజయం సాధించింది.