టాప్, మిడిలార్డర్ రాణించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. ఒడిశాలోని కటక్ లో జరుగుతున్న రెండో వన్డే(ODI)లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఫిల్ సాల్ట్(26), డకెట్(65), రూట్(69), బ్రూక్(31), బట్లర్(34), లివింగ్ స్టోన్(41) ఇలా అంతా రాణించడంతో స్కోరు 300 దాటింది. సాల్ట్-డకెట్ జోడీ బాగా ఆడుతున్న సమయంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి విడదీశాడు. ఈ మ్యాచుతో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన అతడు సాల్ట్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కూడా ఇంగ్లిష్ టీమ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. దీంతో ఆ జట్టు 304 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా 3 వికెట్లు.. షమి, రాణా, పాండ్య, వరుణ్ తలో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ముగ్గురు(లివింగ్ స్టోన్, రషీద్, వుడ్) రనౌట్ అయ్యారు.