ఢిల్లీ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడానికి బదులు వికెట్ పారేసుకోవడంలో ఒకర్ని మించి మరొకరు పోటీ పడ్డారు. మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో భాగంగా RCBతో జరిగిన మ్యాచ్ లో బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 87 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. లానింగ్(17), షెఫాలి(0), జెమీమా(34), సదర్లాండ్(19), కాప్(12), బ్రైస్(23).. ఇలా అంతా తక్కువ స్కోరుకే క్యూ కట్టారు. రేణుక, వేర్హమ్ మూడేసి వికెట్ల చొప్పున తీసుకుని ప్రత్యర్థిని కోలుకోనివ్వకపోవడంతో ఢిల్లీ 141కే ఆలౌటైంది.