టీ20 ప్రపంచకప్ గెలిచిన భారతజట్టుకు ప్రశంసలే కాదు నజరానాలు దక్కుతున్నాయి. ICC ట్రోఫీ గెలిచిన టీమ్ఇండియా సభ్యులకు భారీ నజరానా(Prize)ను BCCI ప్రకటించింది. రోహిత్ సేనకు రూ.125 కోట్లు ఇస్తున్నట్లు బోర్డు కార్యదర్శి జైషా ప్రకటించారు.
‘ICC కప్పు గెలిచిన జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడం గర్వంగా ఉంది.. టోర్నమెంట్ మొత్తం ప్రతిభ, సంకల్పం(Determination), క్రీడాస్ఫూర్తి చాటిన ప్లేయర్లకు అభినందనలు.. ఆటగాళ్లతోపాటు స్టాఫ్ మొత్తానికి ఈ ఘనత చెందుతుంది..’ అంటూ జైషా ట్వీట్ చేశారు.
భారత్-దక్షిణాఫ్రికా ఫైనల్ ను ప్రత్యక్షంగా వీక్షించిన BCCI సెక్రటరీ.. గెలుపు అనంతరం భారత జెండాను గ్రౌండ్ లో నిలబెట్టారు. ఈ ఫైనల్ ఓడినా టీ20 కప్పు గెలిచి జెండా పాతుతాం అంటూ గత వన్డే వరల్డ్ కప్ ఓటమి సందర్భంగా ఆయన అన్నారు. అందులో భాగంగానే బార్బడోస్ మైదానంలో జెండాతో కనిపించారాయన.