భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI.. వేల కోట్లతో వెలిగిపోతోంది. రాష్ట్ర సంఘాలకు అన్ని బకాయిలు చెల్లించాక సాధారణ నిధి రూ.20,686 కోట్లకు చేరిందని ‘క్రిక్ బజ్’ నివేదిక తెలిపింది. గడచిన ఐదేళ్లలో రూ.14,627 కోట్లు రాగా, గతేడాది రూ.4,193 కోట్లు వచ్చాయి. స్వదేశంలో అంతర్జాతీయ మ్యాచ్ లు తగ్గడం వల్ల మీడియా హక్కుల ఆదాయం రూ.2,524.80 కోట్లు కోల్పోయింది. కానీ డిపాజిట్లపై అధిక రాబడితో నిధులు పెరిగాయి. IPL సహా ICC పంపకాలతో 2023-24కి రూ.1623.08 కోట్లు వచ్చాయి. ఇది అంతకుముందు ఏడాది రూ.1167.99 కోట్లుగా ఉంది.