టీమ్ఇండియా ప్రధాన కోచ్(Head Coach)గా గంభీర్ కు అందరి నుంచి మద్దతు(Support) లభించింది. అతడే ఏకైక ప్రత్యామ్నాయన్న రీతిలో BCCI ప్రత్యేక నియామకం చేపట్టింది. అయితే ఫీల్డ్ స్టాఫ్ విషయంలో గంభీర్ ప్రతిపాదనను BCCI తిరస్కరించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
అదేంటంటే…
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్ అయిన దక్షిణాఫ్రికా ప్లేయర్ జాంటీ రోడ్స్ ను టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ గా నియమించాలని గంభీర్ ప్రతిపాదించాడు. IPLలో లఖ్నవూ సూపర్ జెయింట్స్ కు మెంటార్ గా ఉన్న టైంలో రోడ్స్ ఆ జట్టుకు పనిచేశాడు. దీంతో ఈ పరిచయంతో అతణ్ని ఫీల్డింగ్ కోచ్ కు ప్రపోజ్ చేశాడు.
కానీ…
ఈ విషయంలో BCCI ఏ మాత్రం తగ్గలేదు. ఫీల్డ్ స్టాఫ్ కు సంబంధించి అంతా భారతీయులే ఉండాలన్న నియమాన్నే తాము అనుసరిస్తున్నట్లు బోర్డు జవాబిచ్చిందన్నది ఆ వార్త సారాంశం. గత ఏడేళ్లుగా జాతీయ జట్టు స్టాఫ్ అంతా మనవాళ్లే ఉంటున్నారు.
హెడ్ కోచ్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ టీ20 వరల్డ్ కప్ వరకు బాధ్యతలు నిర్వర్తించారు. బౌలింగ్ కోచ్ గా ఆర్.వినయ్ కుమార్ ను తీసుకోవాలని గంభీర్ చెప్పిన మాటను BCCI పట్టించుకోలేదట.