భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI).. ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యం(Air Pollution) వల్ల ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్న దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబయి స్టేడియాల్లో బాణసంచా కాల్చవద్దని సూచించింది. ఈ రెండు నగరాల్లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ ల సందర్భంగా ఎలాంటి బాణసంచా కాల్చకూడదంటూ ప్రకటన విడుదల చేసింది.
మేమెప్పుడూ ముందుంటాం
పర్యావరణాన్ని రక్షించేందుకు ఎప్పుడూ ముందుంటామని, వాయు కాలుష్యంపై పోరాటానికి కట్టుబడి ఉంటామని BCCI కార్యదర్శి జై షా అన్నారు.