యుద్ధ పరిస్థితులు నెలకొన్న వేళ BCCI సంచలన నిర్ణయం తీసుకుంది. IPLను నిరవధికంగా వాయిదా వేసింది. ఉత్తరాదిలో ఉద్రిక్త వాతావరణం వల్ల నిన్న ధర్మశాలలోని ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ మధ్యలోనే రద్దు చేశారు. ఇక చివరి దశ మ్యాచ్ లన్నీ సరిహద్దు రాష్ట్రాల్లోనే ఉండటంతో టోర్నీ నిర్వహించడం సరికాదన్న నిర్ణయానికి BCCI వచ్చింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ హెచ్చరికలు జారీ కావడంతో అక్కడ మ్యాచ్ లు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ సీజన్లో మొత్తం 74కు గాను నిన్నటితో 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈరోజు లఖ్నవూలో సూపర్ జెయింట్స్-బెంగళూరు మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈనెల(మే) 25 వరకు ఇంకో 16 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా IPL-2025 ఆగిపోయింది.