BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు గ్రేడ్-Aలో ముగ్గురు మహిళా క్రికెటర్లు చోటు సంపాదించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్ రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్-Aలో ఉన్నారు. పేసర్ రేణుక ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఓపెనర్ షెఫాలి వర్మ గ్రేడ్-Bలో స్థానం పొందారు. శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు, అరుంధతి రెడ్డి, అమన్ జ్యోత్ కౌర్, ఉమా ఛెత్రి గ్రేడ్-Cలో ఉన్నారు. యాస్తిక భాటియా, రాధాయాదవ్, స్నేహ్ రాణా, పూజ వస్త్రాకర్ ఇప్పటికే ఇదే గ్రేడ్ లో నిలిచారు. ఇక మేఘనా సింగ్, దేవిక వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, హర్లీన్ డియోల్ కు చోటు దక్కలేదు. ఏటా A గ్రేడ్ కు రూ.50 లక్షలు, B గ్రేడ్ కు రూ.30 లక్షలు, C గ్రేడ్ కు రూ.10 లక్షల చొప్పున అందుతాయి.