ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్(Final)కు వేల కోట్లల్లో బెట్టింగ్ నడుస్తోంది. దుబాయి వేదికగా రేపు జరిగే భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కోసం మాఫియా రంగంలోకి దిగింది. రూ.5,000 కోట్ల బెట్టింగ్ వ్యాపారం జరగ్గా.. రేపు భారత్ గెలుస్తుందంటూ ఎక్కువ మంది పందేలు(Betting) కాశారు. ఇందులో చాలా మంది బుకీలు అండర్ వరల్డ్ మాఫియాతో లింక్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురు బుకీల్ని ఢిల్లీ క్రైం బ్రాంచ్ అరెస్టు చేసింది. ఇందులో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘డి.కంపెనీ’ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. భారత్-ఆస్ట్రేలియా సెమీస్ సమయంలోనూ ఇద్దరు బుకీలు పట్టుబడ్డారు. నిందితుల నుంచి మొబైల్స్, ల్యాప్ టాప్స్ వంటివి భారీగా స్వాధీనం చేసుకున్నారు.