
ఆసియా క్రీడ(Asian Games)ల్లో భారత్ గత రికార్డును తిరగరాసింది. గతంలో ఉన్న 70 మెడల్స్ రికార్డుని తాజా క్రీడల్లో బద్ధలు కొట్టింది. చైనాలోని హాంగ్ జౌలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో మన దేశం ఇప్పటివరకు 70 పతకాలు సాధించింది. 2018లో 70 మెడల్స్ అందుకున్న భారత్ ఇప్పుడు దాన్ని అధిగమించింది. ప్రస్తుతం మన ఖాతాలో 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి.
సత్తా చాటుతున్న అథ్లెట్లు
అథ్లెటిక్స్ విభాగంలో మన ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. ఆసియా క్రీడల ఆర్చరీ కాంపౌండ్ మిక్స్ డ్ ఈవెంట్ లో జ్యోతి వెన్నమ్-ఓజస్ డియోటాలే జోడీ గోల్డ్ మెడల్ అందుకుంది. పోటాపోటీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో కొరియన్ జట్టును ఓడించి మెడల్ ను ముద్దాడారు. ఆర్చరీ విభాగంలో ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. అటు 35 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్ లో రాంబాబు-మంజు రాణి జంట కాంస్య పతకం(Bronze Medal) అందుకుంది.