BCCIకి బాంబే హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. IPL ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కు రూ.538 కోట్లు చెల్లించాలన్న వాదనను సమర్థించింది. అసలేం జరిగిందంటే… కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్(KCPL) ఆధ్వర్యంలో నడిచే రెండెజ్వస్ స్పోర్ట్స్ వరల్డ్(RSW)తో కలిసి IPL ఫ్రాంచైజీ కోసం కొచ్చి టస్కర్స్ 2011లో బిడ్ వేసింది. 10% బ్యాంక్ గ్యారంటీ ఇవ్వలేదంటూ సెప్టెంబరులో ఆ ఫ్రాంచైజీని BCCI తొలగించింది. దీనిపై RSW, KCPL 2012లో ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించాయి. రూ.384 కోట్లు KCPLకు, రూ.153 కోట్లను RSWకు ఇవ్వాల్సిందేనని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీన్ని BCCI సవాల్ చేయగా, ట్రిబ్యునల్ తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది.