259/4తో ఉన్న ఇంగ్లండ్ పై విరుచుకుపడ్డాడు జస్ప్రీత్ బుమ్రా(Bumrah). పటిష్ఠంగా కనిపించిన జట్టు కాస్తా అతడి దెబ్బకు 271/7కు చేరుకుంది. నిన్న ఒక వికెట్ తీసిన బుమ్రా.. రెండో రోజు మరో మూడు వికెట్లు దక్కించుకున్నాడు. లార్డ్స్ లో వరుసగా మూడో సెంచరీ చేసిన రూట్(104)తోపాటు బ్రూక్(11), కెప్టెన్ స్టోక్స్(44) బౌల్డయ్యారు. 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు తీయగా.. ఈ మ్యాచులో ఇప్పటిదాకా మొత్తం నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి రోజు నితీశ్ 2, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. రెండో టెస్టు సెంచరీ వీరుడు జేమీ స్మిత్ ను ఎంత తొందరగా ఔట్ చేస్తే అంత త్వరగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించొచ్చు. https://justpostnews.com