పసికూన ఐర్లాండ్ తో భారత్ మ్యాచ్ ఆడనుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ డబ్లిన్ వేదికగా జరగనుంది. ఇప్పటివరకు ఆ జట్టుతో 5 టీ20లు ఆడగా.. అన్నింట్లోనూ టీమ్ ఇండియాదే విజయం. అయితే ఈ సిరీస్ తో భారత మెయిన్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఎంట్రీ ఇస్తున్నాడు. 11 నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ(International) క్రికెట్ ఆడుతున్నాడు. ఈ సిరీస్ కు బుమ్రానే కెప్టెన్ కావడం విశేషం. వెస్టిండీస్ తో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను పోగొట్టుకున్న భారత్.. ఇప్పుడు పసికూనపై సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.