IPLలో ఆకట్టుకునే ప్రదర్శనలు చేసిన కుర్రాళ్లకు BCCI మంచి అవకాశాలనే కల్పిస్తున్నది. టాలెంట్ చూపిన యంగ్ ప్లేయర్స్ ని అన్ని ప్రధాన జట్లకు సెలెక్ట్ చేస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్ తో సిరీస్ కు యశస్వి జైస్వాల్ లాంటి వాళ్లు భారత జట్టు తలుపు తట్టగా… చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ తాజాగా టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. ఆసియా క్రీడల్లో తలపడే భారత క్రికెట్ జట్టుకు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఈ ఈవెంట్(Event) కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టు(Team)ను BCCI సెలెక్ట్ చేసింది. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే ఈ టోర్నీకి… IPL స్టార్ రింకూ సింగ్ ఎంపికయ్యాడు.
ఈ క్రీడల్లో బరిలోకి దిగే ఉమెన్ టీమ్ లో తెలుగమ్మాయిలు అంజలి శర్వాని, బారెడ్డి అనూష ప్లేస్ దక్కించుకున్నారు. ఉమెన్ టీమ్ కు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెగా ఉండనుంది.
జట్టు: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబె, ప్రభ్ సిమ్రన్ సింగ్