అప్రతిహత(Unopposed) విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్(KKR)కు అడ్డుకట్ట వేసింది చెన్నై సూపర్ కింగ్స్(CSK). తొలుత బ్యాటింగ్ అప్పగించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన రుతురాజ్ సేన.. తర్వాత ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 9 వికెట్లకు 137 రన్స్ కే KKR ఆలౌటైతే.. ఆ టార్గెట్ ను కేవలం 3 వికెట్లు కోల్పోయి మాత్రమే రీచ్ అయింది CSK. 17.3 ఓవర్లలో 141 రన్స్ చేసి 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
తొలుత…
మందకొడి పిచ్(Slow Pitch)పై ఆడటమే కష్టంగా మారింది కోల్ కతా ప్లేయర్లకు. స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఓపెనర్ ఫిల్ సాల్ట్(0) వికెట్ కోల్పోయాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్(27), అంగ్ క్రిష్ రఘువన్షీ(24), వెంకటేశ్ అయ్యర్(3), రమణ్ దీప్ సింగ్(13), రింకూ సింగ్(9), అండ్రీ రసెల్(10) ఒకరి వెంట ఒకరు దారి పట్టారు. 85కే 5 కీలక వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ శ్రేయస్(34) కొద్దిసేపు ఆదుకున్నాడు. 4 ఓవర్లకు 18 పరుగులే ఇచ్చిన జడేజా 3 వికెట్లు తీసుకోగా.. తుషార్ దేశ్ పాండే సైతం ఇంకో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
చెన్నై సూపర్ …
ఓపెనర్ రచిన్ రవీంద్ర(15) మరోసారి ఫెయిలైతే కెప్టెన్ రుతురాజ్, డారిల్ మిచెల్(25) జోడీ రెండో వికెట్ కు 70 పరుగుల పార్ట్నర్ షిప్ ఇచ్చింది. టార్గెట్ పెద్దది కాకపోవడంతో మిగతా లాంఛనాన్ని రుతురాజ్(67 నాటౌట్; 58 బంతుల్లో 9×4), శివమ్ దూబె(28; 18 బంతుల్లో 1×4, 3×6) దగ్గరుండి పూర్తి చేశారు.