ప్రపంచ చెస్ ఛాంపియన్ గా మన దేశానికి చెందిన దొమ్మరాజు గుకేశ్(Gukesh) అవతరించాడు. చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను 14వ గేమ్ లో ఉండి చిన్న వయసులోనే ఫిడే వరల్డ్ ఛాంపియన్ రికార్డు అందుకున్నాడు. 18 సంవత్సరాల వయసులోనే క్లాసికల్ చెస్ ఛాంపియన్ గా అవతరించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందిన ఈ చిన్నోడు.. 13వ రౌండ్ వరకు లిరెన్ తో కలిసి 6.5 పాయింట్లతో సంయుక్తం(Joint)గా ఉన్నాడు. కానీ పద్నాలుగో రౌండ్ లో అనూహ్య విజయంతో ప్రపంచ టైటిల్ ను ఎగరేసుకుపోయాడు. గుకేశ్ అటాకింగ్ గేమ్ తో లిరెన్ ఆత్మరక్షణలో పడిపోయాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆ ఘనత అందుకున్న రెండో భారతీయుడిగా గుకేశ్ రికార్డులకెక్కాడు. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం.