15వ సీడ్ గా బరిలోకి దిగిన 19 ఏళ్ల యువతి దివ్య దేశ్ ముఖ్… ఫిడే(FIDE) ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. 38 ఏళ్ల భారత చెస్ స్టార్ కోనేరు హంపిపై ఘన విజయాన్ని అందుకుంది. టైబ్రేకర్ లో భారత మహిళల నంబర్ వన్ ను 1.5-0.5 తేడాతో ఓడించింది. అటు 19 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన దివ్య(Divya) ఆ ఘనత సాధించిన 88వ భారత క్రీడాకారిణి అయింది. ఫిడే ప్రపంచ ఛాంపియన్ అయిన తొలి భారత మహిళ ఆమెనే.
ఎవరీ దివ్య దేశ్ ముఖ్…
నాగపూర్ లోని మరాఠీ కుటుంబానికి చెందిన డాక్టర్ దంపతుల కుమార్తె దివ్య. ఏడేళ్ల వయసులోనే నేషనల్ టైటిల్ నెగ్గి, 3 సార్లు ఒలింపియాడ్ గోల్డ్ మెడల్స్ అందుకుంది. వరల్డ్ జూనియర్ ఛాంపియన్ షిప్, వరల్డ్ యూత్ ఛాంపియన్ షిప్ లోనూ బంగారు పతకాలు సాధించింది. 2023లో ఇంటర్నేషనల్ మాస్టర్ గా అవతరించింది.